మాజీ ఎమ్మెల్యేల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ హామీ 1 y ago
TG: మాజీ ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. వైద్య చికిత్సలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి గొడిశాల రాజేశం గౌడ్ ఆధ్వర్యంలో సీఎంకు మాజీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రుల నిర్లక్ష్యంతో కష్టాలు పడుతున్నారని చెప్పారు. వీరి సమస్యలపై త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు.